సంప్రదాయబద్ధంగా నుదుటికి తిలకం దిద్ది కేటీఆర్‌ను ఆహ్వానించిన దొనికెన పద్మ
హైదరాబాద్, జులై 13(చైతన్యగళం): ఉచిత నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలకు ఈనెల 19వ తేదీన తెలంగాణ భవన్ లో ఘనంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాలలో శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ కార్యక్రమం నిర్వాహకురాలు తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలు దొనికెన పద్మ సంప్రదాయబద్ధంగా నుదుటికి తిలకం దిద్ది, శాలువాతో సత్కరించి ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా దొనికెన పద్మ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన పురస్కరించుకొని గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అందించిన ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సర్టిఫికెట్ల ప్రధాన ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.మహిళల ఆర్థిక పురోగతే లక్ష్యంగా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయని అన్నారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు కుటుంబాభివృద్ధితో పాటు సమాజ పురోగతికి కూడా తమ వంతు పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
