Wednesday, July 15, 2026
Homeతెలంగాణతెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

📰 Generate e-Paper Clip

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలను సోమవారం మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌ నికోలస్‌ విడుదల చేశారు.

హైదరాబాద్, జులై 13 (చైతన్యగళం): తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలను (TG TET Results 2026) ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌ నికోలస్‌ విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet.aptonline.in లో చూసుకోవచ్చని తెలిపారు. ఈ ఫలితాల్లో అభ్యర్థుల మార్కులు, అర్హత తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. జూన్‌ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య మొత్తం పది సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి.

ఈ ఏడాది టీజీ టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,15,028 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,623 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు, 91,405 మంది ఇతర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం పరీక్ష రాసిన వారిలో 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 43.94 శాతంగా నమోదైంది. కమ్యూనిటీ వారీగా చూస్తే ST అభ్యర్థులు 51.03 శాతం అర్హతతో అగ్రస్థానంలో నిలిచారు. అనంతరం BC అభ్యర్థులు 40.36 శాతం, EWS అభ్యర్థులు 22.43 శాతం, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 20.15 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈసారి పరీక్షల్లో మహిళా అభ్యర్థులు పురుషుల కంటే మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. పేపర్-Iలో పరీక్ష రాసిన నలుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల్లో ఇద్దరు అర్హత సాధించారు. పేపర్-II (మ్యాథ్స్) విభాగంలో 32,555 మంది మహిళలు హాజరుకాగా 12,495 మంది అర్హత సాధించారు. అదే విభాగంలో 11,567 మంది పురుషులు హాజరుకాగా 5,488 మంది క్వాలిఫై అయ్యారు. ఆరుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల్లో నలుగురు అర్హత సాధించడం విశేషం. అలాగే పేపర్-II (సోషల్ స్టడీస్) విభాగంలో 23,008 మంది మహిళలు పరీక్ష రాయగా 5,009 మంది అర్హత సాధించారు. మహిళల ఉత్తీర్ణత శాతం అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఉండటం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!