కరీంనగర్, జూలై 11 (చైతన్యగళం):
కరీంనగర్ పట్టణంలోని 11KV శివనగర్ ఫీడర్పై లైన్ నిర్వహణ పనుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
ఈ సందర్భంగా ఏడీఈ (ఓపి టౌన్–2) ఎం. లావణ్య ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు శివనగర్, సప్తగిరి కాలనీ, రామచంద్రపూర కాలనీ, ప్రగతి నగర్, రామ్నగర్ అని పేర్కొన్నారు.
విద్యుత్ అంతరాయం విషయంలో వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
