Friday, July 10, 2026
Homeతెలంగాణకరీంనగర్రేపు కరీంనగర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు కరీంనగర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 10 (చైతన్యగళం):
రెండవ శనివారం నిర్వహణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ రూరల్, టౌన్ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

రూరల్ ఏడీఈ గడం రఘు ప్రకటన ప్రకారం – బొమ్మకల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహణ పనులు జరగనున్నాయి. ఈ కారణంగా సిరిపురం కాలనీ, రజ్వీ చమన్, సిటిజన్ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, కృష్ణ నగర్ కాలనీ, ఆటో నగర్, ధర్మ నగర్, బైపాస్ రోడ్, బొమ్మకల్, గుంటూరుపల్లి, విజయ్ నగర్ కాలనీ, సెల్ఫీ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.

అదేవిధంగా కొత్తపల్లి (హెచ్), రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 11.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

టౌన్–2 ఏడీఈ ఎం. లావణ్య ప్రకటన ప్రకారం – ఉదయం 9.30 నుండి 11.30 వరకు కట్ట రాంపూర్ మెయిన్ రోడ్, తిరుమల నగర్, మహాలక్ష్మి నగర్, శ్రేయం అపార్ట్మెంట్, వినాయక నగర్, మైనార్టీ స్కూల్ ఏరియా, గిద్ద పెరుమాండ్ల గుడి ఏరియా, హనుమాన్ నగర్, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, గణేష్ నగర్ బైపాస్, కమాన్ ఏరియా, ఎన్టీఆర్ స్టాచ్యూ ఏరియా, అల్కాపురి కాలనీ, ఐటీఐ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీ హబ్, విశాల్ మార్ట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.

నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!