Monday, July 6, 2026
Homeఆంధ్రప్రదేశ్దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేశ్ భేటీ..

దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేశ్ భేటీ..

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

సియోల్: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంసంగ్, ఎల్‌జీ, ఎస్‌కే, ఏఎస్‌ఐపీ-ఏపీఏసీటీ ఓశాట్‌ల ఆధారంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 కోసం చర్యలు చేపట్టాలని గౌరంగలాల్ దాస్‌ని లోకేశ్ కోరారు. ఇందుకు అనుగుణంగా కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, చిప్ దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో రెడీ టు యూజ్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి కొరియా-అనుసంధాన నైపుణ్య కార్యక్రమాలకు (VLSI, ATMP/ప్యాకేజింగ్, SMT, డిస్‌ప్లేలు) సహకరించాలని కోరారు. ఏప్రిల్ 2026లో సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భారత్ పర్యటన సందర్భంగా ‘కొరియా ఎన్‌క్లేవ్’కు సిద్ధంగా ఉన్నామన్నారు. కొరియన్ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SMEs) కోసం ఉద్దేశించిన ప్లగ్-అండ్-ప్లే టౌన్‌షిప్‌కు శ్రీసిటీలో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కొరియా ప్రాధాన్యతారంగ పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని ఈ సందర్భంగా గౌరంగలాల్ దాస్‌ను కోరారు. అనంతపురంలో కియా, హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్‌ను విస్తరించడంపైనా వారిద్దరూ చర్చించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తీరంలో హెచ్‌డీ హ్యుందాయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌, బ్యాటరీ/గ్రీన్-హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేశ్ సూచించారు. ఏపీ-సౌత్ కొరియా మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొరియా ప్లస్, KOTRA, భారత్-కొరియా పారిశ్రామిక సహకార కమిటీలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక ఏపీ-కొరియా డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈనెల 10న నిర్వహించే సియోల్ ఇన్వెస్టర్ రోడ్‌షో, G2G అవగాహన ఒప్పందాల వైపు మళ్లించేలా చొరవ చూపాల్సిందిగా భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌కి మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!