Monday, July 6, 2026
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

గన్నేరువరం, జూలై 5 (చైతన్యగళం): గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలకు ఆదివారం భూమి పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.లబ్ధిదారులు సంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసి, పూజలు చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు నాణ్యతతో గృహాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గాలిపల్లి రాజయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మైసంపల్లి తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వోడ్నాల నరసయ్య, బండి రాములు, దుడ్డు మల్లేశం, బద్దం శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రమణారెడ్డి, తోట పవన్, తోట లక్ష్మణ్, వారాల మల్లేశం, గాలిపెల్లి శంకరయ్య, బండి ముత్యం, బొడిగె ముత్తయ్య తదితరులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!