నంద్యాల (చైతన్యగళం): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు “ వన్ మంత్ ఫోర్ విజిట్” కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించేందుకు ఇది చక్కని అవకాశం అని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం మహానంది లోని కమ్మ సత్రం నందు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా , జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ,జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ , మరికొందరు జిల్లా అధికారులు కలసి ప్రత్యేక ” “ప్రజాసమస్యల పరిష్కార వేదిక “ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
అధికారులు వారి వారి శాఖల వారీగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడంతోపాటు మరికొన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించే దిశగా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై అధిక ప్రాధాన్యత నిస్తోందని ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తారని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…ప్రజల నుంచి అందిన వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక PGRS ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి – జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీ ఎస్
RELATED ARTICLES
