కల్వకుర్తి, జూలై 3 (చైతన్యగళం):
కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా లింగరావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు.తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ఈ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసేవకుడిగా నిరంతరం ఆర్థిక సహాయం అందిస్తూ, పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.10,000 సహాయం అందజేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు కాసు శ్రీనివాస్ రెడ్డికి ఈ గుర్తింపు దక్కిందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.లింగరావుపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుతూ, కొత్త అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు.
