జన జీవన సమస్తం ప్లాస్టిక్ పీడన మయం సౌకర్యం పేరున
ప్లాస్టిక్ వినియోగం జీవనశైలిలో భాగమైంది కూరగాయలు పాలు
పెరుగు టిఫిన్ క్యారేజ్ వినియోగ వస్తువుల వాడకంలో సింగిల్
యూజ్ ప్లాస్టిక్ కవర్లు పెరిగి ప్రాణాంతక మైందిఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచి శతాబ్దాల
పాటు భూమికి మోయలేని
బరువు అవుతుంది చెరువులు నదులను ముంచేస్తుంది గాలిని
నీటిని విషం చేస్తోంది సింగిల్ యూస్ ప్లాస్టిక్ చెబుదాం స్వస్తి అప్పుడేకదా మన భూమికి అసలైన ఆస్తి ప్లాస్టిక్ కాలుష్యం
మానవ మనుగడకు
ప్రమాదకర మైంది ప్లాస్టిక్ వ్యర్ధాలు
పర్యావరణానికి ముప్పుగా మారాయిప్లాస్టిక్‌ను కాల్చడం
విషవాయువు పెరిగిఆహారం నీరు కలుషితమై మనుషుల ఆరోగ్యం దెబ్బతిని భయంకర రోగాలు
ప్రభలు తున్నాయి వైద్య
ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితి
దిగజారుతోంది ప్రతి ఏటా నాల్గు వందల మిలియన్ల ప్లాస్టిక్ ఉత్పత్తులు నింగి నేల నీరు సముద్రాలను ప్లాస్టిక్ తో నింపుతూ
కాలుష్య కాసారాలకు ఆవాసాలుగా మారాయి
కర్భన ఉద్గారాలను శిలాజ
ఇంధనాలను తగ్గించాలి
నగరాల్లో అపార్ట్మెంట్ కల్చర్
తగ్గించాలి వికేంద్రీకృత
ఉత్పత్తులను ప్రోత్సాహించాలి
చేనేత రంగానికి చేయూత
ఇవ్వాలి సేంద్రీయ సేద్యం
మట్టి పాత్రల వాడకంపై
అవగాహన పర్యావరణ పై
చైతన్యం పెంచాలి మానవ స్వార్థం పడగ విప్పింది భూగోళం కాలుష్య మయమైంది భూమాతను రక్షించుకోవాలి కలుషిత కారకాలను నిషేధించాలి
ప్లాస్టిక్ కాలుష్యం మానవాళికి
భూగోళ ఆరోగ్యానికి చేసే హాని
మీద అవగాహన కల్పించడానికి
ఈ ఏడు ప్లాస్టిక్ బ్యాగ్ రహిత
దినోత్సవం (2026) థీమ్
ఒకేసారి ఉపయోగించే
ప్లాస్టిక్ ల నుండి విముక్తి
పొందడం స్థిరమైన భవిష్యత్తు
వైపు అడుగులు వేయడం
ఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ సంచులు కవర్లపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించడం నిత్యజీవితంలో ప్లాస్టిక్ బదులుగాపర్యావరణఅనుకూలమైన బట్ట సంచులు జనుపనార సంచులుమరియు కాగితం సంచులను వాడేలాప్రజలను ప్రోత్సహించడంభూమి సముద్రాలు మరియు వన్యప్రాణులను ప్లాస్టిక్
కాలుష్యం నుండి కాపాడుకుంటూ
స్వచ్ఛమైన సమాజాన్ని
నిర్మించడం.ప్లాస్టిక్ వాడకం వద్దు
ప్రత్యామ్నాయాల ఉత్పత్తి
వినియోగమే ముద్దు ప్లాస్టిక్ కాలుష్య రహిత ఉత్పత్తి
విధానాలే పాలకుల విధానం
కావాలి ప్లాస్టిక్ రహిత సమాజ
స్థాపనకు ప్రభుత్వాలు పౌర
సమాజం ఉద్యమించాలి
కనుమరుగవ్వాలి ప్లాటిక్ సంచి
కళకళలాడాలి జనుపనార సంచి
భూదేవిని రక్షించే మార్గంగా
బట్టసంచి కాగితపు సంచులు
కావాలి ప్రత్యామ్నాయం
మనచేతిలోఉండాలి జనుప సంచి
సంచి ప్లాస్టిక్ వాడితే పృథ్వికి చేటు
ప్రకృతికి జరుగును కోలుకోని వేటు
పారేసే ప్లాస్టిక్ తెచ్చును జబ్బు జనుప సంచితో ప్రజారోగ్యం మెరుగు రండికదలిరండి జనులారా ప్లాస్టిక్ మహమ్మారిని తరమేద్దాం చేపడుదాం జనుపనార సంచులు పునరుత్పత్తి ఇంధన శక్తి వనరుల
వినియోగం పెరుగాలిబయో ఎనర్జీ సూర్య రష్మి పవన విద్ధ్యుత్ శిలాజ ఇంధన వనరుల ఉపయోగం పెరగాలి ప్రత్యామ్నాయ పునరుత్పాదక వనరుల వినియోగం పెరుగాలి
కాలుష్య రహిత పరిశ్రమలు
బట్ట సంచులు జనపనార
సంచులు చేతబడదాం
సమాజానికి ప్లాస్టిక్ రహిత
సుస్థిర భవిష్యత్తును ఇద్దాం
ఈరోజేమనమంతా ప్రతిజ్ఞ చేద్దాం
పచ్చధనం ప్రకృతిని రాబోయే
తరానికి కానుకగా ఇద్దాం.
నేదునూరి కనకయ్య
రాష్ట్రఅధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
తెలంగాణ వికాస వేదిక
కరీంనగర్9440245771
