Thursday, July 2, 2026
Homeతెలంగాణకాలనీల అభివృద్ధే లక్ష్యం.. ఈవినింగ్ వాక్‌లో పత్య నాయక్

కాలనీల అభివృద్ధే లక్ష్యం.. ఈవినింగ్ వాక్‌లో పత్య నాయక్

📰 Generate e-Paper Clip

ఆమనగల్లు, జూలై 1 (చైతన్యగళం): ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ బుధవారం సాయంత్రం ఈవినింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, వీధి దీపాలు తదితర సమస్యలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే గుర్తించి, ప్రాధాన్యత ఆధారంగా పరిష్కార చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ అధికారులకు సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఆంజనేయులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొని కాలనీల్లో సమస్యలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. స్థానికులు విమలమ్మ, అంజి, చంటి, సురేష్ గౌడ్, సువాసిని, కిరణ్‌తో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!