కాలనీల అభివృద్ధే లక్ష్యం.. ఈవినింగ్ వాక్‌లో పత్య నాయక్
ఆమనగల్లు, జూలై 1 (చైతన్యగళం): ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ బుధవారం సాయంత్రం ఈవినింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, వీధి దీపాలు తదితర సమస్యలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే గుర్తించి, ప్రాధాన్యత ఆధారంగా పరిష్కార చర్యలు చేపట్టాలని మున్సిపల్...