Thursday, September 3, 2026
Homeతెలంగాణపెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి - సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  • పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. లక్ష విరాళం

ఆమనగల్లు, జూన్ 30 (చైతన్యగళం): ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం ఆధ్యాత్మిక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ (TASK) సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం రూ.1 లక్ష విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి, సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధిలో దేవాలయాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఆలయాల అభివృద్ధికి తన సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహాయం కోరగానే వెంటనే స్పందించి రూ.1 లక్ష విరాళం అందించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన విరాళం ఆలయ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత సైదులు, ఉపసర్పంచ్ రమేష్ గౌడ్, వార్డు సభ్యులు శివ, శ్రీనాథ్, మల్లేష్, రాంనుంతల మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, ఆలయ కమిటీ సభ్యులు కిష్టయ్య, రమేష్, మల్లేష్, జగన్, శ్రీను, గణేష్, రాజు, సైదులు, భాస్కర్, తిరుపతయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!