Monday, June 29, 2026
Homeతెలంగాణసిద్ధిపేటహుస్నాబాద్ నియోజకవర్గంలో 74.49 కి.మీ మేర హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ ఏ ఎం )...

హుస్నాబాద్ నియోజకవర్గంలో 74.49 కి.మీ మేర హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ ఏ ఎం ) రహదారుల అభివృద్ధికి రూ.148.97 కోట్లు మంజూరు

📰 Generate e-Paper Clip

చైతన్యగళం హుస్నాబాద్ జూన్ 27 
హుస్నాబాద్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా మొత్తం 74.49 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.148.97 కోట్ల మంజూరు చేశారు
మంజూరైన రోడ్లలో హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన మొత్తం 8 ప్రధాన రహదారి పనులు ఉన్నాయి. వీటి ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.హుస్నాబాద్ నియోజకవర్గంలో మనురైన హమ్ రోడ్ల వివరాలు
హనుమకొండ జిల్లా
1.హనుమకొండ జిల్లాలోని గుంటూరుపల్లి – కేశవాపూర్ వయా తిమ్మాపూర్ రహదారి బలోపేతం (3.99 కి.మీ.) రూ.3.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు..
2.హనుమకొండ జిల్లాలోని వంగర – ములకనూరు – భీమదేవరపల్లి రహదారి బలోపేతం 5.00 కి.మీ లకు రూ.4.39 కోట్ల రూపాయలు
3.హనుమకొండ జిల్లా పరిధిలోని బావుపేట్ – కమలాపూర్ రోడ్ (బావుపేట్ , ఆరేపల్లి, గుంటూరుపల్లి ,శంబునిపల్లి , కనిపర్తి కమలాపుర్) 6.00 కి.మీ లకు రూ.6.95 కోట్ల రూపాయలు
కరీంనగర్ జిల్లా
4.కొత్తగట్టు–దుద్దెనపల్లి రహదారి బలోపేతం (10.90 కి.మీ లకు రూ.9.57 కోట్ల రూపాయలు
సిద్దిపేట జిల్లా లో మంజూరైన రోడ్లు
5.తంగలపల్లి – బద్దిపడిగ వయా గుండారెడ్డిపల్లి రహదారి బలోపేతం 8.00 కి.మీ లకు రూ.7.02 కోట్ల రూపాయలు6.ముల్కనూర్–కొహెడ రహదారి బలోపేతం 16.00 కి.మీ లకు 18.53 కోట్ల రూపాయలు7.కోహెడ – దేవక్కపల్లి వయా రామచంద్రాపూర్ రహదారి విస్తరణ, బలోపేతం 14.60 కి.మీ లకు 40.1 కోట్ల రూపాయలు
8.హుస్నాబాద్–అక్కన్నపేట పీడబ్ల్యూడీ రహదారి విస్తరణ, బలోపేతం 10.00 కి.మీ. లకు రూ.58.91 కోట్లుహుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ మొత్తం లో రోడ్ల అభివృద్ధికి 148.97 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ, వాణిజ్య, విద్య, వైద్య సేవలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.హుస్నాబాద్ నియోజకవర్గ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ రహదారి ప్రాజెక్టులు కీలక మైలురాయిగా నిలుస్తాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!