Thursday, June 25, 2026
Homeతెలంగాణనూతన కలెక్టరేట్‌లో పలు నిర్మాణాలకు శంకుస్థాపన

నూతన కలెక్టరేట్‌లో పలు నిర్మాణాలకు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

  • పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

కరీంనగర్, జూన్ 24 (చైతన్యగళం): శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద హెలిప్యాడ్ నిర్మాణం, సర్వీస్ రోడ్డు, ప్రవేశ ద్వారం ఏర్పాటుకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

53 లక్షల రూపాయల సుడా నిధులతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కొత్త కలెక్టరేట్ నుండి ఈశాన్యం గేట్ వరకు రహదారి అభివృద్ధి, గార్డెన్ సుందరీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ రెండు పనులను కోటి ఇరవై లక్షల రూపాయలతో చేపట్టనున్నారు.

ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ – “నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి. కరీంనగర్ సమగ్ర అభివృద్ధే మా ధ్యేయం. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి” అని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ఆర్‌అండ్‌బి ఈ నరసింహ చారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!