Friday, November 27, 2026
Homeతెలంగాణసామాన్య కార్యకర్తలకు ప్రోత్సాహమే బీజేపీకి బలం

సామాన్య కార్యకర్తలకు ప్రోత్సాహమే బీజేపీకి బలం

📰 Generate e-Paper Clip

  • అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు: చెప్యాల మురళీ మనోహర్‌ గౌడ్‌

చిగురుమామిడి, నవంబర్ 26 (చైతన్యగళం): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ కరీంనగర్‌ పర్యటన సందర్భంగా సామాన్య కార్యకర్తనైన తనకు ఆయనను ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడే అవకాశం కల్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు బీజేపీ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెప్యాల మురళీ మనోహర్‌ గౌడ్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌ గడ్డపై జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ను కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించే సామాన్య కార్యకర్తలకు నాయకత్వం అందించే ప్రోత్సాహం ఎంతో స్ఫూర్తినిస్తుందని, ఇలాంటి అవకాశాలు కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపి పార్టీ బలోపేతానికి కృషి చేసేలా ప్రేరేపిస్తాయని అన్నారు.

ఈ అరుదైన అవకాశం లభించేందుకు సహకరించిన బీజేపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావులకు కూడా మురళీ మనోహర్‌ గౌడ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!