- మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ స్థానం కైవసం
తలకొండపల్లి, నవంబర్ 21 (చైతన్యగళం): చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా నిర్వహించిన మండల స్థాయి ప్రతిభా పరీక్షలో తలకొండపల్లిలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించారు. పాఠశాలకు చెందిన బి. శ్రీజ, ఎం. అఖిల్, పి. ప్రణవి ఈ విజయాన్ని సొంతం చేసుకుని పాఠశాలకు పేరు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాళ్లు గిరి, సుభాష్, కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో కష్టపడి చదువుతూ భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

