Thursday, November 26, 2026
Homeసంపాదకీయంరాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు చికోడ్ విద్యార్థినులు

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు చికోడ్ విద్యార్థినులు

📰 Generate e-Paper Clip

  • అండర్‌-14 బాలికల విభాగంలో సిద్దిపేట జిల్లా జట్టుకు ప్రథమ స్థానం

దుబ్బాక, నవంబర్‌ 4 (చైతన్యగళం):

క్రీడారంగంలో చికోడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 బాలికల వాలీబాల్‌ పోటీల్లో సిద్దిపేట జిల్లా జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ విజయంతో చికోడ్‌ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

హత్నూర మండలం దౌల్తాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నవంబర్‌ 2న నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి పోటీల్లో సిద్దిపేట జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. జట్టు సమన్వయం, పట్టుదల, క్రీడా నైపుణ్యంతో ప్రత్యర్థి జట్లను అధిగమించి ప్రథమ స్థానాన్ని సాధించింది.

ఈ పోటీల్లో చికోడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినులు ఎ. శ్యామల, కె. హారిక తమ ఆటతీరుతో ఆకట్టుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తొలుత జిల్లా జట్టుకు ఎంపికైన వీరు, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు.

గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై చికోడ్‌ గ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. వారి విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. పాఠశాల వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు భాను కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థినులు క్రీడలపై చూపిన ఆసక్తి, నిరంతర సాధన, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!