Tuesday, October 27, 2026
Homeతెలంగాణకరీంనగర్దివ్యాంగ యువతకు ఈ నెల 28న జాబ్‌ మేళా

దివ్యాంగ యువతకు ఈ నెల 28న జాబ్‌ మేళా

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): నిరుద్యోగ దివ్యాంగ యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 28న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డాక్టర్‌ ప్రియాంక తెలిపారు. ఇర్కోడ్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్‌ మేళాతోపాటు టామ్‌కామ్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఐదు ప్రైవేటు సంస్థలు పాల్గొనే ఈ జాబ్‌ మేళాకు పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. నిరుద్యోగ దివ్యాంగ యువత, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!