Friday, October 9, 2026
Homeతెలంగాణనల్గొండఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌ నిరసన

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌ నిరసన

📰 Generate e-Paper Clip

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌.. రాహుల్‌గాంధీ అరెస్టును ఖండిస్తూ ఆందోళన

దామరచర్ల, అక్టోబరు 8 (చైతన్యగళం): ఓటర్ల జాబితా వివాదంపై ఏఐసీసీ పిలుపు మేరకు దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొర్ర నాగునాయక్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కొర్ర నాగునాయక్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఓట్ల చోరీకి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్‌, రవితేజ నాయక్‌, అంజిరెడ్డి, బంటు కిరణ్‌, గాలం వెంకన్నయాదవ్‌, సర్పంచులు నర్సిరెడ్డి, నాగునాయక్‌, పొకల వెంకటేశ్వర్లు, సైదానాయక్‌, హతిరాం నాయక్‌, రవీందర్‌నాయక్‌, మంగతనాయక్‌, కిరణ్‌నాయక్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!