ప్రతి మండలంలో రెండు గ్రామాల ఎంపిక.. అధికారులకు అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఆదేశం
సిద్దిపేట, అక్టోబరు 7 (చైతన్యగళం): భూభారతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి మండలంలో ఎంపిక చేసిన రెండు గ్రామాల్లో భూముల రీ-సర్వేను నవంబరు 30లోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, భూముల సర్వే అధికారులకు భూభారతి రీ-సర్వేపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, భూ రికార్డులను పరిశీలించి సర్వే చేపట్టాలని సూచించారు. నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్. సుదర్శన్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
