Monday, October 5, 2026
Homeతెలంగాణరంగారెడ్డిఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ స్వర్ణకుమారి

ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ స్వర్ణకుమారి

📰 Generate e-Paper Clip

  • రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఏసీబీ దాడి
  • రూ.లక్ష లంచం.. డీఎంహెచ్‌ఓ అరెస్ట్‌
  • ఆసుపత్రి అనుమతుల కోసం లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

కొత్త ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన అనుమతులు, లైసెన్సు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు పథకం ప్రకారం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. లంచం సొమ్మును స్వీకరిస్తున్న సమయంలో డీఎంహెచ్‌ఓను పట్టుకున్నట్లు సమాచారం.

కార్యాలయంలో సోదాలు

ఈ ఘటన అనంతరం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. కార్యాలయంలోని పలు రికార్డులు, దస్త్రాలను పరిశీలించినట్లు సమాచారం.

ఆసుపత్రుల అనుమతులు, లైసెన్సుల మంజూరు వ్యవహారంలో మరెవరైనా అక్రమాలకు పాల్పడ్డారా? ఈ లంచం వ్యవహారంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.

కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!