ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ స్వర్ణకుమారి

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఏసీబీ దాడి రూ.లక్ష లంచం.. డీఎంహెచ్‌ఓ అరెస్ట్‌ ఆసుపత్రి అనుమతుల కోసం లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. కొత్త ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన అనుమతులు, లైసెన్సు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌ చేసినట్లు...