Saturday, October 3, 2026
Homeతెలంగాణకరీంనగర్విద్యార్థులకు పోషకాహారం అందించడమే ప్రభుత్వ ధ్యేయం

విద్యార్థులకు పోషకాహారం అందించడమే ప్రభుత్వ ధ్యేయం

📰 Generate e-Paper Clip

  • అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి

హుస్నాబాద్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి అన్నారు. విద్యార్థుల్లో హాజరు శాతాన్ని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా దండి లక్ష్మి మాట్లాడుతూ పోషకాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు చదువుపై మరింత శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన విద్యార్థి–బలమైన భవిష్యత్తు లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని కోరారు. హుస్నాబాద్‌ కళాశాలలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!