విద్యార్థులకు పోషకాహారం అందించడమే ప్రభుత్వ ధ్యేయం

అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి హుస్నాబాద్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి అన్నారు. విద్యార్థుల్లో హాజరు శాతాన్ని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దండి లక్ష్మి మాట్లాడుతూ పోషకాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం...