Saturday, October 3, 2026
Homeతెలంగాణరంగారెడ్డివిద్యతోనే సమసమాజ స్థాపన సాధ్యం

విద్యతోనే సమసమాజ స్థాపన సాధ్యం

📰 Generate e-Paper Clip

  • పేద విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

షాద్‌నగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): విద్య ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. హజీపల్లి శివారులోని సిండికేట్‌ కాలనీలో విద్యకు దూరమైన పేద విద్యార్థుల కోసం నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.

కాలనీలో బడి మానేసిన విద్యార్థులను గుర్తించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే నిర్వహించడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, పాఠశాల సంచులు, భోజనంతో పాటు అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇప్పటికే సుమారు 50 మంది దాతలు రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు విరాళాలు అందించారని, మరింత మంది దాతలు ముందుకు వస్తున్నారని చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సహకరిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, ఎంఈఓ, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, విద్యాశాఖ అధికారులు, దాతలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!