విద్యతోనే సమసమాజ స్థాపన సాధ్యం
పేద విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్‌నగర్, సెప్టెంబరు 30 (చైతన్యగళం): విద్య ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. హజీపల్లి శివారులోని సిండికేట్ కాలనీలో విద్యకు దూరమైన పేద విద్యార్థుల కోసం నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. కాలనీలో బడి మానేసిన విద్యార్థులను గుర్తించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే నిర్వహించడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, పాఠశాల సంచులు, భోజనంతో పాటు అవసరమైన అన్ని...