Tuesday, September 29, 2026
Homeతెలంగాణకరీంనగర్విద్యుత్ కాంతుల్లో మెరిసిన కొత్త కలెక్టరేట్

విద్యుత్ కాంతుల్లో మెరిసిన కొత్త కలెక్టరేట్

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం):

సీఎం రాకకు కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చీకట్లను చీల్చుకుంటూ విరజిమ్ముతున్న విద్యుత్ కాంతులు, బంతిపూల వర్ణశోభతో మెరిసిపోతున్న ప్రాంగణం, ఆకట్టుకునే అలంకరణతో కలెక్టరేట్ భవనం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి మరికొద్ది గంటలే ఉండటంతో అధికారులు తుది ఏర్పాట్లను పూర్తి చేశారు. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో కొత్త భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూలదండలు, బంతిపూలతో భవనాన్ని అందంగా అలంకరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు రాత్రి వరకు ఏర్పాట్లలో నిమగ్నమై తుది పనులను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రతి అంశాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వేదిక, ప్రాంగణం, అలంకరణ, భద్రత, పార్కింగ్, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి వరకు కొత్త కలెక్టరేట్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభానికి సిద్ధం కావడంతో జిల్లా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఆధునిక వసతులతో అందుబాటులోకి రానున్న కొత్త కలెక్టరేట్ జిల్లా పరిపాలనకు కొత్త రూపాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ భవనం కరీంనగర్ జిల్లా పాలనా చరిత్రలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!