విద్యుత్ కాంతుల్లో మెరిసిన కొత్త కలెక్టరేట్

కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): సీఎం రాకకు కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చీకట్లను చీల్చుకుంటూ విరజిమ్ముతున్న విద్యుత్ కాంతులు, బంతిపూల వర్ణశోభతో మెరిసిపోతున్న ప్రాంగణం, ఆకట్టుకునే అలంకరణతో కలెక్టరేట్ భవనం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి మరికొద్ది గంటలే ఉండటంతో అధికారులు తుది ఏర్పాట్లను పూర్తి చేశారు. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో కొత్త భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూలదండలు,...