Monday, September 28, 2026
Homeతెలంగాణప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు

ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు

📰 Generate e-Paper Clip

  • కేసముద్రం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డా. శబరీష్‌

కేసముద్రం, సెప్టెంబరు 26(చైతన్యగళం): ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మెరుగైన పోలీసు సేవలు అందించాలని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డా. శబరీష్‌, ఐపీఎస్‌ సూచించారు. శుక్రవారం కేసముద్రం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌ పరిసరాలు, పరిశుభ్రత, సిబ్బంది విధులు, కేసుల దర్యాప్తు, పెండింగ్‌ కేసుల వివరాలను పరిశీలించారు. ఎస్‌ఐ క్రాంతి కిరణ్‌తో మాట్లాడి నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

పోలీసు సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి స్థానిక సమస్యలు, నేర ప్రవృత్తులు, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు ప్రజలతో సమన్వయం పెంచుకుని ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేయాలని ఆదేశించారు. రాత్రి గస్తీని పటిష్ఠం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని, డయల్‌-112 అత్యవసర కాల్స్‌కు వెంటనే స్పందించాలని తెలిపారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాలని, యువతను వాటికి దూరంగా ఉంచేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు, బాలల భద్రత, సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా విని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలను కలిసే సమయాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రజలు పోలీసులను స్వేచ్ఛగా ఆశ్రయించేలా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని, ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించాలని ఎస్పీ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!