Monday, September 28, 2026
Homeతెలంగాణచాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

📰 Generate e-Paper Clip

  • సామాజిక అన్యాయాన్ని ఎదిరించిన వీరవనిత: ఎస్పీ డా. శబరీష్‌

మహబూబాబాద్, సెప్టెంబర్ 26(చైతన్యగళం): తెలంగాణ వీరవనిత, రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా ఎస్పీ డా. శబరీష్‌ పి., ఐపీఎస్‌ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం మహబూబాబాద్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్‌ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక అన్యాయాన్ని, పెత్తందారీ దోపిడీని ధైర్యంగా ఎదిరిస్తూ హక్కుల కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన ధైర్యం, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

మహిళా చైతన్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఎంతో గొప్పదని ఎస్పీ అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ఆ ఆశయాలను ఆచరణలో కొనసాగించాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, బలహీన వర్గాలకు అండగా నిలిచి ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేయడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!