Sunday, September 27, 2026
Homeతెలంగాణమహమ్మదాపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

మహమ్మదాపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

📰 Generate e-Paper Clip

  • ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు ముందుకు సాగాలి

హుస్నాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): మండలంలోని మహమ్మదాపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను మడేలేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సంఘ శ్రీధర్‌ మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రజక వృత్తిదారులకు నామినేటెడ్‌ పదవుల్లో చైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ జిల్లాల తిరుమల, ఉపసర్పంచ్‌ కత్తుల సమ్మరాజు, వార్డు సభ్యుడు బొల్లి తిరుపతి, బీజేపీ జిల్లా నాయకుడు బొల్లి శ్రీనివాస్‌, మడేలేశ్వర రజక సంఘం గౌరవ అధ్యక్షుడు సంఘ రాజయ్య, అధ్యక్షుడు సంఘరాజు ప్రవీణ్‌, వెంకటేష్‌, రమేష్‌, రాజు, సదానందం, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!