మహమ్మదాపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు ముందుకు సాగాలి హుస్నాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): మండలంలోని మహమ్మదాపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను మడేలేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ శ్రీధర్‌ మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పోరాట...