- జూరాల నుంచి సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలి: గుర్రాల రాంభూపాల్‌రెడ్డి
కల్వకుర్తి, సెప్టెంబరు 22 (చైతన్యగళం): జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావును జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్‌రెడ్డి ఖండించారు.
ఈ సందర్భంగా రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న రామచందర్‌రావును అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. నాయకులను అదుపులోకి తీసుకున్నంత మాత్రాన రైతుల సమస్యలపై జరుగుతున్న ఆందోళనలను ఆపలేరని పేర్కొన్నారు.
జూరాల ప్రాజెక్టు నుంచి తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, సాగునీటి అందుబాటుపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
