రామచందర్‌రావును అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించిన బీజేపీ నేత
జూరాల నుంచి సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలి: గుర్రాల రాంభూపాల్‌రెడ్డి కల్వకుర్తి, సెప్టెంబరు 22 (చైతన్యగళం): జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావును జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్‌రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న రామచందర్‌రావును అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. నాయకులను అదుపులోకి తీసుకున్నంత మాత్రాన రైతుల...