Tuesday, October 13, 2026
Homeతెలంగాణబెల్టు షాపులను తొలగించాలని గౌరవెల్లి గ్రామ ప్రజల వినతి

బెల్టు షాపులను తొలగించాలని గౌరవెల్లి గ్రామ ప్రజల వినతి

📰 Generate e-Paper Clip

అక్కన్నపేట, సెప్టెంబర్‌ 20 (చైతన్యగళం): గౌరవెల్లి గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను తొలగించి, మద్యం వల్ల తలెత్తుతున్న కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక సమస్యలను అరికట్టాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పాలకవర్గ సభ్యులకు వినతిపత్రం సమర్పించారు.

గ్రామంలో మద్యం సులభంగా అందుబాటులో ఉండటంతో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, పిల్లల చదువుపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధిక మద్యపానం ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం పెరుగుతోందని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ప్రమాదాలు, ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా యువత మద్యానికి దూరంగా ఉండేలా విద్య, క్రీడలు, ఉపాధి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరారు.

గ్రామంలో అనధికారిక మద్యం విక్రయాలపై సంబంధిత ఎక్సైజ్‌, పోలీసు అధికారులకు సమాచారం అందించి చట్టప్రకారం చర్యలు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించేందుకు గ్రామ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!