బెల్టు షాపులను తొలగించాలని గౌరవెల్లి గ్రామ ప్రజల వినతి

అక్కన్నపేట, సెప్టెంబర్‌ 20 (చైతన్యగళం): గౌరవెల్లి గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను తొలగించి, మద్యం వల్ల తలెత్తుతున్న కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక సమస్యలను అరికట్టాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పాలకవర్గ సభ్యులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో మద్యం సులభంగా అందుబాటులో ఉండటంతో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, పిల్లల చదువుపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధిక మద్యపానం ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం...