ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 15 (చైతన్యగళం): కొంగరకాలన్ డివిజన్ పరిధిలోని చింతపల్లిగూడ గ్రామంలో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి భూమిపూజ నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ పీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఉక్కుల అశోక్ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ గణేశుడు, శ్రీ చెన్నకేశవస్వామి, భూమాతకు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తై, గ్రామ ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో జోగు శేఖర్, శేరి రమేష్, ఉడుతల రవికుమార్ గౌడ్, బత్తుల నర్సింహారెడ్డి, జోగు మహేందర్, జోగు బాలయ్య, శేరి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
