Sunday, September 13, 2026
Homeతెలంగాణకరీంనగర్మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ

మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ

📰 Generate e-Paper Clip

  • 56వ డివిజన్‌లో ఇంటింటికీ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
  • జాగీర్‌ సాగర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్‌ నగరంలోని 56వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాగీర్‌ సాగర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా డివిజన్‌ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేస్తూ, పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. మట్టి విగ్రహాల వినియోగం వల్ల నీటి వనరుల పరిరక్షణకు తోడ్పడటంతో పాటు పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నాగుల సతీష్‌, అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ మార్క రాజుగౌడ్‌, జగదీష్‌, శరత్‌తో పాటు డివిజన్‌ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!