మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ

56వ డివిజన్‌లో ఇంటింటికీ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జాగీర్‌ సాగర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం కరీంనగర్‌, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్‌ నగరంలోని 56వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాగీర్‌ సాగర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్‌ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేస్తూ, పర్యావరణహితంగా...