Saturday, September 12, 2026
Homeతెలంగాణపరిసరాల పరిశుభ్రతపై కాళోజీ వాకర్స్ ప్రత్యేక శ్రద్ధ

పరిసరాల పరిశుభ్రతపై కాళోజీ వాకర్స్ ప్రత్యేక శ్రద్ధ

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్ అర్బన్, సెప్టెంబర్ 12(చైతన్యగళం):
ఆరోగ్య పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు నిర్వహించిన కార్యక్రమంలో స్టేడియం పరిసరాల్లో పడేసిన విస్తరాకులు, వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, ఐస్‌క్రీమ్ కప్పులు, పేపర్ ప్లేట్లు, చాక్లెట్ కవర్లు తదితర వ్యర్థాలను వాకర్స్ సేకరించి మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం స్టేడియంలోని వివిధ రకాల చెట్లకు మున్సిపల్ వాటర్ ట్యాంకర్ సహకారంతో నీటిని అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు నామిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్య సలహాదారు మైస శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి రెండో శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ తమ అసోసియేషన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. ‘ఈ గ్రౌండ్ మన అందరిదీ.. పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా మనందరి బాధ్యత’ అని వారు ప్రజలకు సూచించారు. స్టేడియానికి వచ్చే ప్రజలు, యువత, చిన్నారులు ఉపయోగించిన బాటిళ్లు, ప్లేట్లు, ఇతర వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్తబుట్టల్లో వేయాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ పాల్గొని వాకర్స్‌కు సహకారం అందించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణువర్ధన్‌తో పాటు పెద్ది వెంకన్న, శ్రీహరి, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బిక్షం, రాంబాబు, రాజన్న, దేవేందర్‌రెడ్డి, రామకృష్ణరావు, ఎంఎస్‌రెడ్డి, రవీందర్, లక్ష్మీనారాయణ, ఐలేష్, ఉపేందర్, మల్లయ్య, దామోదర్‌రెడ్డి, బి.రాజు, వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, రామకృష్ణ, తోలం వెంకటేశ్వర్లు, పగడయ్య, నాగేశ్వరరావు, నాగరాజు, రాధాకృష్ణ, నేరెళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!