పరిసరాల పరిశుభ్రతపై కాళోజీ వాకర్స్ ప్రత్యేక శ్రద్ధ
మహబూబాబాద్ అర్బన్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): ఆరోగ్య పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు నిర్వహించిన కార్యక్రమంలో స్టేడియం పరిసరాల్లో పడేసిన విస్తరాకులు, వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, ఐస్‌క్రీమ్ కప్పులు, పేపర్ ప్లేట్లు, చాక్లెట్ కవర్లు తదితర వ్యర్థాలను వాకర్స్ సేకరించి మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం స్టేడియంలోని వివిధ రకాల చెట్లకు...