- నాలుగు విభాగాల్లో బహుమతులు కైవసం
ఆరుట్ల, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో గురువారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో అంబోత్ తండా సీఐసీఎఫ్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు బహుమతులను కైవసం చేసుకున్నారు.
జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ బహుమతి, సీనియర్ బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ బహుమతి, జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ బహుమతి సాధించి సత్తా చాటారు. మొత్తంగా నాలుగు విభాగాల్లో బహుమతులు సాధించడం విశేషం.
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ అందించి, పోటీలకు సన్నద్ధం చేసిన పాఠశాల పీఈటీ లింగస్వామి, ఇన్చార్జ్ అంబోత్ శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.
విద్యార్థుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు విభాగాల్లో బహుమతులు సాధించిన సీఐసీఎఫ్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.
