మండల స్థాయి క్రీడా పోటీల్లో సీఐసీఎఫ్ విద్యార్థుల ప్రతిభ
నాలుగు విభాగాల్లో బహుమతులు కైవసం ఆరుట్ల, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో గురువారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో అంబోత్ తండా సీఐసీఎఫ్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు బహుమతులను కైవసం చేసుకున్నారు. జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ బహుమతి, సీనియర్ బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ బహుమతి, జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ బహుమతి సాధించి సత్తా చాటారు. మొత్తంగా నాలుగు విభాగాల్లో బహుమతులు సాధించడం...