Wednesday, August 5, 2026
Homeతెలంగాణబోనాల ఉత్సవాలను విజయవంతం చేసినందుకు మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు ముదిరాజ్ సంఘాల ఘన సన్మానం

బోనాల ఉత్సవాలను విజయవంతం చేసినందుకు మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు ముదిరాజ్ సంఘాల ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కరీంనగర్ టౌన్ , ఆగస్టు 03(చైతన్యగళం):

నగరంలోని 14 ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు బోనాల పండుగ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ ని సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మేయర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి తమ అభినందనలు తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు నగరపాలక సంస్థ అన్ని విధాలుగా సహకరించడం వల్లే ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగాయని వారు పేర్కొన్నారు.మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్న నిర్వాహక కమిటీలు, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు, భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అన్ని మతాలు, వర్గాల పండుగలకు నగరపాలక సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 14 ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!