Monday, August 3, 2026
Homeక్రైమ్ న్యూస్వెలిచాలలో జూదంపై పోలీసుల దాడి

వెలిచాలలో జూదంపై పోలీసుల దాడి

📰 Generate e-Paper Clip

రామడుగు(చైతన్యగళం): మండలంలోని వెలిచాల గ్రామంలో అక్రమంగా పత్తాల జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రామడుగు పోలీసులు ఆదివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా జూదం ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేరుకున్న వెంటనే కొందరు పరారయ్యేందుకు యత్నించగా, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి పట్టుకున్నట్లు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి రూ.10,420 నగదు, రెండు మోటార్‌సైకిళ్లు, ఐదు మొబైల్‌ ఫోన్లు, పత్తాల కట్టలు, జూదం నిర్వహణకు ఉపయోగించిన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని చట్టపరమైన నిబంధనల మేరకు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు నేరాలకు దారితీయడంతో పాటు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయని రామడుగు ఎస్‌ఐ కె. రాజు పేర్కొన్నారు. జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు లేదా డయల్‌–112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!