వెలిచాలలో జూదంపై పోలీసుల దాడి
రామడుగు(చైతన్యగళం): మండలంలోని వెలిచాల గ్రామంలో అక్రమంగా పత్తాల జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రామడుగు పోలీసులు ఆదివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా జూదం ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేరుకున్న వెంటనే కొందరు పరారయ్యేందుకు యత్నించగా, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10,420 నగదు, రెండు మోటార్‌సైకిళ్లు, ఐదు మొబైల్ ఫోన్లు, పత్తాల కట్టలు, జూదం నిర్వహణకు ఉపయోగించిన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని చట్టపరమైన నిబంధనల మేరకు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు....