Sunday, August 2, 2026
Homeక్రైమ్ న్యూస్మర్రిగూడలో నాటు సారా పట్టివేత

మర్రిగూడలో నాటు సారా పట్టివేత

📰 Generate e-Paper Clip

మర్రిగూడ, ఆగస్టు 1 (చైతన్యగళం):
మర్రిగూడ పోలీసులు శనివారం అక్రమంగా నాటు సారాను విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నాలుగు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి. రాంబాబు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన మాధగోని రాజు గౌడ్ ద్విచక్ర వాహనంపై నాటు సారాను తీసుకువచ్చి మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సమయంలో వారి వద్ద ఉన్న గుడుంబాను స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

“అక్రమంగా నాటు సారాను విక్రయిస్తే చర్యలు తప్పవు. నిషేధిత గుడుంబాను తయారు చేసిన వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఎస్సై రాంబాబు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!