- ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చిన సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
ఆమనగల్, నవంబర్ 22 (చైతన్యగళం): ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రబిక్య తండాలో నిర్మాణంలో ఉన్న హనుమాన్ దేవాలయానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎర్రబిక్య తండాకు చేరుకున్న ఆయన నిర్మాణంలో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధితోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం తండా ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధిపై తమ విజ్ఞప్తికి స్పందించి స్వయంగా దేవాలయాన్ని సందర్శించి సహకారం అందిస్తానని హామీ ఇచ్చిన సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నగ్రియ, నరేష్, రమేష్, భాస్కర్, విజేందర్, వెంకట్, కైలాస్, పాండు, సోమ్ల, శివ, జైపాల్, గోజీ, సీతారామ్, శ్రీను, చిన్న, కుమార్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

