నిర్మాణంలో ఉన్న హనుమాన్‌ దేవాలయానికి సహకారం అందిస్తా

ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చిన సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆమనగల్‌, నవంబర్‌ 22 (చైతన్యగళం): ఆమనగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రబిక్య తండాలో నిర్మాణంలో ఉన్న హనుమాన్‌ దేవాలయానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్‌ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎర్రబిక్య తండాకు చేరుకున్న ఆయన నిర్మాణంలో ఉన్న హనుమాన్‌ దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని ఆలయ కమిటీ...