Saturday, November 21, 2026
Homeతెలంగాణక్రీడా పోటీలతో గ్రామీణ యువత ప్రతిభకు గుర్తింపు

క్రీడా పోటీలతో గ్రామీణ యువత ప్రతిభకు గుర్తింపు

📰 Generate e-Paper Clip

  • క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి అందజేసిన పాపిశెట్టి రాము

కల్వకుర్తి, నవంబర్‌ 21 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీల నిర్వహణతో యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేష్‌ అన్నారు. కల్వకుర్తిలో ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టును వారు అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడలపైనా దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి టోర్నమెంట్లు యువతలో ఉత్సాహాన్ని నింపడంతోపాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ సంఘసేవకుడు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు, కౌన్సిలర్‌ పాపిశెట్టి రాము విజేత జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.25 వేల నగదును అందజేశారు. క్రీడాకారులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు గుమ్మకొండ రాజు, రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీను నాయక్‌, పరశురాం నాయక్‌, రాకేష్‌తోపాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!